Wednesday, November 20, 2024

CWC Final – టాస్ గెలిచిన ఆస్ట్రేలియా – బ్యాటింగ్ చేయ‌నున్న భారత్

అహ్మ‌దాబాద్ – నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్‌ పండుగ ముంగిపు దశకు చేరింది. ట్రోఫీ కోసం జరిగే ఫైనల్‌ పోరులో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది… .. భార‌త జ‌ట్టు బ్యాటింగ్ కు దిగనుంది

ఇక ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్‌ కొమ్ములు వంచి… మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు.

క్రికెట్‌ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. ఇరుజట్లకు ఇది రెండో టైటిల్‌ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్‌ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 20 ఏళ్ల తర్వాత నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ప్రస్తుత సమీకరణాలను బటిచూస్తే భారతజట్టే హాట్‌ ఫేవరెట్‌. ఈ మ్యాచ్ లో భార‌త్ విశ్వ‌విజేత‌గా నిల‌వాల‌ని భార‌త క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement