Friday, November 22, 2024

CWC 2023 – ఉప్ప‌ల్ స్టేడియంలో మ‌రికొద్దిసేప‌టిలో పాక్ తో నెద‌ర్లాండ్స్ ఢీ…

హైద‌రాబాద్- వన్డే ప్రపంచకప్‌ 2023లో రెండో మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పల్ వేదికగా పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్న పాక్‌.. రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ ఓడిపోవడం ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. ప్రధాన టోర్నీలో పసికూన నెదర్లాండ్స్‌పై గెలిచి ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తోంది. మరోవైపు క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న డచ్‌ టీమ్ ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటాలని భావిస్తోంది.

నెదర్లాండ్స్‌ను తక్కువగా అంచనా వేస్తే.. పాకిస్తాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్‌ జట్టునే డచ్‌ టీమ్ చిత్తు చేసింది. ఆసియా కప్‌ వైఫల్యం పాక్ జట్టును వెంటాడుతోంది. అంతేకాదు నసీమ్ షా గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో పాక్ బౌలింగ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే పాకిస్థాన్‌ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. నెదర్లాండ్స్‌పై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి అభిమానులకు ఉప్పల్ మైదానంలో ఎంట్రీ ఉంటుంది. మ్యాచ్‌ జరిగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌ కోసం 1200 మంది పోలీస్‌లతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌ కోసం 1200 మంది పోలీసులతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం అర్ద రాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉండనున్నాయి. దాంతో నేడు ఉప్పల్‌ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఎంతమంది హాజరవుతారో అని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే.. ఉప్పల్‌ మైదానంలో ఒక్క భారత్ మ్యాచ్ కూడా లేదు.

తుది జట్లు:
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిం, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్.

నెదర్లాండ్స్: విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేస్సీ, బాస్ డి లీడే, తేజా నిడమనూరు/కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, లోగాన్ వాన్ బీక్, సాకిబ్ జుల్ఫికర్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీర్కెరెన్, ఆర్యన్ దత్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement