Tuesday, November 26, 2024

CWC 2023 – కాన్వే, ర‌వీంద్రల శ‌త‌కాల మోత‌.. విజ‌యం దిశ‌గా న్యూజిల్యాండ్ ..

అహ్మ‌దాబాద్ – బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన కివీస్ బ్యాటింగ్‌లోనూ దుమ్ముదులుపుతోంది. వన్డే వరల్డ్‌ కప్‌ ఆరంభ పోరులో భాగంగా 283 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. డెవిన్‌ కాన్వే రచిన్‌ రవీంద్ర శ‌త‌కాలు బాదేశారు.. ప్ర‌స్తుతం కాన్వే 140, ర‌వీంద్ర 117 ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.. ఇంకా 15 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గా, న్యూజిల్యాంగ్ విజ‌యానికి కేవ‌లం 12 ప‌రుగులు కావ‌ల‌సిఉంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆటగాళ్ల వికెట్లను వరుసగా పడగొడుతూ షాకుల మీద షాకిచ్చింది. దీంతో బెయిర్‌స్టో (33), మలన్‌ (14), బ్రూక్‌ (25), అలీ (11), బట్లర్‌ (43), లివింగ్‌స్టోన్‌ (20) తక్కువ పరుగులకే ఔట్‌ చేసి పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో కివీస్‌ బౌలర్లను తట్టుకుని జో రూట్‌ ( 77) ఒక్కడే నిలబడ్డాడు. హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రూట్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్‌ ఓక్స్‌ ( 11), సామ్‌ కర్రన్‌ (14) కూడా కివీస్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 282 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, మిచెల్‌ శాంటర్న్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, రచిన్‌ రవీంద్ర చెరో వికెట్‌ తీశారు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే న్యూజిలాండ్‌ 283 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement