చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 61వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్ మెన్లు తడబడి ఆడడంతో భారీ స్కోర్ చేయలేకపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు మాత్రమే చేశారు. దీంతో సీఎస్కే జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 20 ఓవర్లలో 142 పరుగులు చేయాల్సి ఉంది.
రాజస్థాన్ బ్యాట్స్ మెన్లు రియాన్ పరాగ్ 47 పరుగులు, ధృవ్ జురెల్ 28 పరుగులు, యశస్వి జైస్వాల్ 24 పరుగులు, జాస్ బట్లర్ 21 పరుగులు, సంజూ శాంసన్ 15 పరుగులు చేశారు. జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. సీఎస్కే బౌలర్లు సిమర్ జిత్ సింగ్ మూడు వికెట్లు, తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లు తీశారు. సీఎస్కే జట్టు ఫీల్డింగ్ లో కట్టడి చేయడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఎక్కువ స్కోరు చేయలేకపోయారు.