ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఓపైవు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మద్య రేసు రసవత్తరంగా జరగుతుండగా.. చెన్నైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్‌కే జట్టు నుంచి ఒకే సారి ఐదుగురు బౌలర్లు దూరం అయినట్లుగా తెలుస్తొంది.
చెపాక్ వేదికగా (బుధవారం) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. చెన్నై ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే తన తదుపరి మ్యాచ్‌ను కూడా పంజాబ్ కింగ్స్‌తోనే ఆడనుంది. ఈ మ్యాచ్ మే 5న ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు చెన్నై జట్టుకు చెందిన ఐదుగురు స్టార్ బౌలర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణా, మహేశ్ తీక్షణ లు వివిధ కారణాలతో అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. వీరు ఎప్పుడు తిరిగి జట్టుతో చేరతారనే ఖచ్చితమైన సమాచారం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ స్వదేశానికి వెళ్లనున్నాడు. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ముస్తాఫిజుర్ కి ఈ సీజన్‌లో చివరి మ్యాచ్.
పంజాబ్ కింగ్స్‌తో (బుధవారం) జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ గాయపడ్డాడు. తొలి ఓవర్‌లో రెండు బంతులే వేసి మైదానాన్ని వీడాడు. అతడి గాయంపై ఇప్పటి వరకు ఎలాండి అప్‌డేట్ లేదు. అయితే, అతడు కోలుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజులు సమయం పట్టనుందని తెలుస్తోంది.
మరోవైపు తుషార్ దేశ్‌పాండే జ్వరంతో బాధపడుతున్నాడు. మతీషా పతిరణా, మహేశ్ తీక్షణలు టీ20 ప్రపంచకప్‌కు వీసా ప్రాసెస్ కోసం శ్రీలంకకు వెళ్లారు. దీంతో ఐదుగురు స్టార్ బౌలర్లు లేకుండానే మే 5వ తేదీన పంజాబ్‌తో చెన్నై మ్యాచ్ ఆడనుంది. దీంతో చెన్నైకి ఒకరకంగా గట్టి దెబ్బే తగిలిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి.. ఐదు మ్యాచుల్లో గెలవగా మరో ఐదు మ్యాచుల్లో ఓడింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.