ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ చోరీకి గురైంది. అయితే ఆ బ్యాగ్లో తనకు సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ పేర్కొన్నాడు. ఎవరు తీసుకెళ్లినా తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. జనవరి 3న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం వార్నర్ మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్తుండగా అతడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్లో గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఇచ్చే క్యాప్), తన పిల్లల విలువైన వస్తువులు ఉన్నాయని ఆ బ్యాగ్ ఎవరు తీసినా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాడు.