ఖాట్మండు – యువతిపై అత్యాచారం చేసిన కేసులో నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానేనికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది ఖాట్మండు జిల్లా కోర్టు. యువతిపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జైలుశిక్ష విధించడమే కాక రూ. మూడు లక్షలు జరిమానా విధించింది. వాటితోపాటు బాధితురాలికి రూ.రెండు లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కాగా, ఆగస్ట్ 21, 2022న తిల్‌గంగాలోని ఒక హోటల్‌లో సందీప్ లామిచానేని తనపై అత్యాచారానికి పాల్పడినట్లు గుషాలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. ఇంటర్ పోల్ సాయంతో అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ కేసులో మొదట బాధితురాలు తాను మైనర్‌నని ఆరోపించినప్పటికీ.. న్యాయస్థానం మైనర్ కాదని తెల్చింది. గత డిసెంబరులో అతన్ని దోషిగా తేల్చిన ఖాట్మండు డిస్ట్రిక్ కోర్టు తాజాగా తుది తీర్పునిచ్చింది.
క్రికెట్ నుంచి సస్సెండ్ …
అత్యాచారం కేసులో జైలు శిక్ష పడటంతో సందిప్ ను ఆ దేశ క్రికెట్ సంఘం ఇవాళ సస్పెండ్ చేసింది. లామిచానేను సస్పెండ్ చేయడంతో అతడు ఎలాంటి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదని ఈ ప్రకటనలో తెలిపింది. లామిచానే నేపాల్ తరపున 103 మ్యాచ్‌లలో 210 వికెట్లు పడగొట్టాడు. 2018-20 మధ్యకాలంలో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించి 9 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.