Friday, November 22, 2024

Cricket : విండీస్‌దే సిరీస్‌.. నెద‌ర్లాడ్ పై 5 వికెట్ల తెడాతో విజ‌యం..

ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘనవిజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది… మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ సింగ్‌ (46), మాక్స్‌ ఒడౌడ్‌(51) రాణించారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎడ్‌వర్డ్స్‌ 68 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం అయ్యారు. ఇక తొలి వన్డేలో అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న తేజ నిడమనూరు 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో 214 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌట్‌ అయింది. 215 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన షాయీ హోప్‌ను 18 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు నెదర్లాండ్స్‌ బౌలర్‌ బాస్‌ డీ లీడ్‌. ఇక బ్రూక్స్‌ సైతం కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. బానర్‌ (15), కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (10) పూర్తిగా నిరాశ పరిచారు. దీంతో విజయంపై నెదర్లాండ్స్‌కు ఆశలు చిగురించాయి. అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాండన్‌ కింగ్‌కు కేసీ కార్టీ సహకారమందించాడు. ఇరువురు సమయోచితంగా ఆడుతూ జట్టును విజయతీరాకు చేర్చారు. బ్రాండన్‌ కింగ్‌ 90 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, కేసీ కార్టీ కూడా 43 పరుగులు చేశాడు. విండీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన బ్రాండన్‌ కింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్కోరు బోర్డు: నెదర్లాండ్స్‌: 48.3 ఓవర్లలో 214 ఆలౌట్‌
వెస్టిండీస్‌: 45.3 ఓవర్లలో 217/5

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement