కివీస్ 259 ఆలౌట్
వాషింగ్టన్ సుందర్ ఏడు, అశ్విన్‌కు మూడు వికెట్లు
కాన్వే, రచిన్ రవీంద్ర అర్ధసెంచరీలు
బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో పేస్ పిచ్ పై ఓటమిపాలైన టీమిం డియా… ఇప్పుడు రెండో టెస్టులో స్పిన్ పిచ్ పై విజృంభిస్తోంది. ఇవాళ పుణేలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. పూణెలోని మోదీ స్టేడియంలో జరుగుతున్న సెకండ్ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈనేపథ్యంలో మొదటి టెస్టులో దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, సీమర్ సిరాజ్‌లపై టీమ్ మేనేజ్‌మెంట్ వేటు వేసింది. అదేవిధంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టారు.
వారి స్థానంలో శుభ్‌మన్‌గిల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది. ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో.. న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఔటయ్యాడు. వ్యక్తిగతం 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసుకున్నాడు. టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడింది. 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లతో కివీస్ ను దెబ్బకొట్టారు. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ డెవాన్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశారు. కెప్టెన్ టామ్ లాథమ్ 15, విల్ యంగ్ 18, డారిల్ మిచెల్ 18, టామ్ బ్లండెల్ 4 , సాంట్నర్ 33 పరుగులు చేశారు.