Saturday, September 21, 2024

Cricket | టెస్ట్ ఫార్మాట్‌కు వార్న‌ర్ గుడ్‌బై..

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో చివరి టెస్టు సిరీస్‌ ఆడుతున్న అతడు జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.

చివరి టెస్ట్‌ ఆడనున్న వేళ వార్నర్‌ పై ఆసీస్‌ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్‌ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. వార్నర్‌ అద్బుతమైన ఆటగాడన్న మెక్‌డొనాల్డ్‌… జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడని కొనియాడాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోబోతుండడం ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బని వార్నర్ అన్నాడు.

మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసించాడు. వార్నర్ అద్భుతమైన ఆటగాడని… జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడని మెక్ డొనాల్డ్ కొనియాడాడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి వైదొలగడం ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ అని వార్నర్ అన్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు వార్నర్‌ని ఎంపిక చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయని… వాటన్నింటికీ తొలి టెస్టులోనే డేవిడ్ భాయ్ సమాధానం చెప్పాడని ఆసీస్ కోచ్ చెప్పాడు. అయితే, వార్నర్‌ను భర్తీ చేయడం తమకు కష్టమని అతను అంగీకరించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడని గుర్తు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement