బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ ఆధిపత్యం కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 84ఓవర్లలో 7వికెట్లకు 343 పరుగులు చేసింది. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 95 బంతుల్లో 12ఫోర్లు, 2 సిక్సర్లతో 112పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకున్నాడు. విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ 176బంతుల్లో 11ఫోర్లు, 2సిక్స్‌లతో 94పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. మరో స్టార్ బ్యాటర్ లబుషేన్ 117 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్‌లతో 74పరుగులు చేసి అర్ధశతకంతో రాణించాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి ట్రావిస్ హెడ్ 112 బ్యాటింగ్, మిచెల్ స్టార్క్ 10పరుగులుతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 196 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్‌సన్ మూడువికెట్లతో సత్తా చాటాడు.
ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్
రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మార్కస్ హ్యారీస్ (3)ను రాబిన్‌సన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం లబుషేన్, వార్నర్ ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. అయితే 12వ ఓవర్లో వార్నర్ 17పరుగులు వద్ద బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే నో బాల్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. మొత్తంమీద వార్నర్‌కు మూడు లైఫ్‌లు లభించాయి. అయినా సెంచరీని వార్నర్ త్రుటిలో కోల్పోయాడు. 55.2ఓవర్లో వార్నర్ 94పరుగులు వద్ద ఉండగా రాబిన్‌సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వార్నర్ కంటే ముందు లబుషేన్ జాక్‌లీచ్ క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు.
దీంతో రెండో వికెట్‌కు 156పరుగు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత స్మిత్ (12) నిరాశపరిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. చివరగా వార్నర్, కామెరూన్ గ్రీన్ (0) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 195పరుగులకు ఆసీస్ 5వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. క్యారీ (12), కమిన్స్ (12), స్టార్క్ (10) ఔటయ్యారు. కాగా తొలి రోజు ఇంగ్లండ్ 147పరుగులుకే ఔటైంది. కెప్టెన్ కమిన్స్ 5వికెట్లతో మెరిశాడు.