టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక పూర్తయ్యింది. అయితే తనతోపాటు టీమిండియా సపోర్టివ్ టీమ్‌లో ఎవరిని ఎంచుకున్నారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ద్రవిడ్ అండర్ 19 కోచింగ్ డేస్ నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్‌సీఏ) తనతోపాటు నమ్మకంగా ఉన్న వ్యక్తులను సపోర్టివ్ స్టాఫ్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
వారిలో విక్రమ్ రాథోడ్, టి. దిలీప్ ఇప్పుడు ద్రవిడ్‌కు అసిస్ట్ చేయనున్నారు. అయితే.. టి. దిలిప్ ది తెలంగాణ నేపథ్యం కావడం గమనార్హం. ఈ కొత్త కోచింగ్ స్టాఫ్ అంతా న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభమయ్యే (నవంబర్ 17 నుండి) సమయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. “ప్రస్తుతం దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీలంక టూర్‌లో ఉన్నాడు. ఇప్పటికే జట్టు ఆటగాళ్లతో కలిసి పనిచేశాడు.” అని BCCI ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.