ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు రానుంది. ఇక్కడ ఆసీస్ మహిళా జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటన డిసెంబర్‌లో ప్రారంభమై జనవరిలో ముగియనుంది. ఈ మూడు ఫార్మాట్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం 16 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది.
అయితే ఆసీస్ స్టార్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఆమే స్థానంలో ఇప్పటీవరకు మరో సారథి పేరును క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించకపోవడం గమనార్హం. ఈ పదహారు మంది బృందంలోనూ కెప్టెన్ ఎవరో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించలేదు.
ఆస్ట్రేలియా స్క్వాడ్: డార్సీ బ్రౌన్, లౌరెన్ చీట్లే (టెస్టుకు మాత్రమే), హీదర్ గ్రహామ్, ఆష్లే గార్డ్‌నర్, కిమ్ గార్థ్, గ్రేస్ హర్రీస్ (టీ20లకు మాత్రమే), అలీష హీలీ, జెస్ జొన స్సెన్, అల్నా కింగ్, ఫోబె లిచ్ ఫీల్డ్, తహిలా మెగ్రాత్, బెథ్ మూనీ, ఎలిసి పెర్రీ, మెగన్ స్కచ్త్, అన్నబెల్ సుథెర్లాండ్, జార్జియా వరెహమ్.