Saturday, November 23, 2024

వెస్టిండీస్‌ గత వైభవాన్ని మళ్లీ చూడలేం: కర్ట్‌లీ ఆంబ్రోస్

ఒకప్పుడు వెస్టిండీస్ టీమ్ అంటే క్రికెట్లో అందరికీ వణుకు పుట్టేది. విండీస్ టూర్కు వెళ్లాలంటే ప్రతి జట్టు కి ఓ సవాల్ గా ఉండేది. ఇలాంటి వెస్టిండీస్ జట్టు రాను రాను ఓ సాదాసీదా జట్టు గా మారిపోయింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విండీస్‌ 1975, 1979లో వన్డే ప్రపంచకప్‌లను గెలిచింది. 33 ఏళ్ల విరామం తర్వాత 2012లో టీ20 ప్రపంచకప్‌ను కరీబియన్‌ జట్టు సాధించింది. దీనిపై లేడీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ విచారం వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్‌ క్రికెట్ జట్టు గత వైభవాన్ని తాను మళ్లీ చూస్తానని అనుకోవట్లేదని లెజెండరీ మాజీ ఫాస్ట్ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్‌ అన్నారు. వెస్టిండీస్‌కు క్రికెట్‌తో ఉన్న బంధం ఈతరం కరీబియన్‌ కుర్రాళ్లకు అర్థం కావట్లేదన్నారు. ఇతర జట్లకు వెస్టిండీస్ గట్టి పోటీ ఇవ్వొచ్చు, ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవచ్చు కానీ.. ఆ రోజులను మాత్రం తలపించదు అని ఆంబ్రోస్‌ పేర్కొన్నారు. 

నిజాయికి ప్రస్తుత విండీస్‌ జట్టులో ఎక్కువగా హిట్టర్లే ఉన్నారు. ఓపెనర్ల నుంచి మొదలుకుని బౌలర్ల వరకు బంతిని బలంగా బాదగలరు. అంబ్రీస్, బ్రావో, గేల్, పావెల్, కింగ్, పూరన్, పోలార్డ్, అల్లెన్, ఛేజ్, హోల్డర్, పాల్, హోప్, రసెల్.. వీరందరి ఆట టీ20లకు మాత్రమే సరిపోతుంది. టెస్ట్, వన్డేలకు వచ్చేసరికి జట్టు విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీ20ల్లో తప్ప టెస్ట్, వన్డేల్లో సరైన ప్రదర్శన చేసిన సందర్భాలు లేవు. అందుకే కర్ట్‌లీ అంబ్రోస్ తన జట్టుపై ఆందోళన వ్యక్తం చేశారు.

నా ఉద్దేశం ఇప్పుడున్న విండీస్‌ క్రికెటర్లను అగౌరవపరచడం కాదు. గొప్ప ఆటగాళ్లుగా ఎదిగే సమర్థత ఉన్న ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కొందరున్నారు. కానీ ఎప్పటికైనా విండీస్‌ క్రికెట్‌కు పూర్వవైభవం వస్తుందని నేను అనుకోవట్లేదు. వివ్ రిచర్డ్స్‌, డెస్మండ్ హేన్స్‌, గోర్డాన్ గ్రీనిడ్జ్, బ్రియాన్ లారా, రిచీ రిచర్డ్సన్, మాల్కం మార్షల్‌, మైఖేల్ హోల్డింగ్‌, కర్ట్‌లీ అంబ్రోస్, ఆండీ రాబర్ట్స్‌, క్లైవ్ లాయిడ్ ఇలా చెప్పుకుంటూ పొతే జాబితా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి ఆటగాళ్లు ఇప్పుడు రావడం చాలా కష్టం’ అని కర్ట్‌లీ అంబ్రోస్ పేర్కొన్నారు. 1988 నుంచి 2000 వరకు వెస్టిండీస్‌కు ఆడిన 57 ఏళ్ల ఆంబ్రోస్‌ 98 టెస్టుల్లో 405 వికెట్లు పడగొట్టారు. 176 వన్డేల్లో 225 వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement