న్యూజిలాండ్ క్రికెట్లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కరోనా బారిన పడగా.. తాజాగా స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు వైరస్ సోకింది. ప్రస్తుతం కాన్వే ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడిని క్లోస్ కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్ బోర్డు హెచ్చరించింది.
కరోనా పాజిటివ్ రావడంతో పాకిస్థాన్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతడి స్థానంలో చాడ్ బోవెస్ను కివీస్ బోర్డు ఎంపిక చేసింది.‘డెవాన్ కాన్వేకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ నుంచి కాన్వే తప్పుకున్నాడు. నిన్ని నిర్వహించిన టెస్ట్ పాజిటివ్‌గా తేలడంతో కాన్వే క్రైస్ట్‌చర్చ్ హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాంటర్బరీ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చాడ్ బోవ్స్ ఈ రోజు జట్టులో చేరనున్నాడు’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడమ్ కూడా కరోనా బారిన పడ్డాడని న్యూజిలాండ్ బోర్డు తెలిపింది. అతడి స్థానంలో బ్రెండన్ డంకెర్స్ జట్టుతో కలుస్తాడని పేర్కొంది. ఇక ప్రస్తుతం టీమ్ లో ఉన్న వారందరికి కరోనా టెస్ట్ లు చేశారు.. వాటి ఫలితాలు రావలసి ఉంది.