న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రాస్‌వెల్ కొవిడ్ బారిన పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టీమ్… రెండో టెస్ట్ ముగిసిన తర్వాత బుధవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేయించగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఇప్పటికే కెప్టెన్ కేన్ విలయమ్సన్ కరోనా బారిన పడి టెస్టు సిరీస్ దూరం కాగా, తాజాగా ఆల్‌రౌండర్ మిచెల్ బ్రాస్‌వెల్ కూడా కరోనాతో జట్టు నుంచి వైదొలగాడు. జూన్ 23న జరుగనున్న మూడో టెస్ట్‌లో మిచెల్ బ్రాస్‌వెల్ ఆడటం కష్టమే. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు మిచెల్ బ్రాస్‌వెల్ ఐసొలేషన్‌లో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.