Thursday, November 21, 2024

ముగ్గురు వెస్టిండీస్‌ ఆటగాళ్లకు కరోనా..

కరాచి: పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ జట్టుకు సిరీస్‌ ముందే షాక్‌ తగిలింది. విండీస్‌ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాక్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్‌ కరాచీ చేరుకుంది. ఈక్రమంలో ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా రోస్టన్‌ ఛేజ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కైల్‌ మేయర్స్‌ కరోనా బారిన పడ్డారని తేలింది. దీంతో వీరిని ప్రత్యేక ఐసోలేసన్‌ కేంద్రానికి తరలించినట్లు విండీస్‌ బోర్డు ప్రకటనలో తెలిపింది. మిగిలిన ఆటగాళ్లకు కరోనా నెగిటివ్‌ రావడంతో సిరీస్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరగనుంది. పాక్‌-వెస్టిండీస్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌లోని తొలి టీ20 నేడు కరాచీ వేదికగా సాయంత్రం 6గంటలకు జరగనుంది.

ఇద్దరు బంగ్లా మహిళా క్రికెటర్లకు ఒమిక్రాన్‌
ఢాకా: బంగ్లాదేశ్‌ మహిళాజట్టులోని ఇద్దరు క్రికెటర్లకు కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ అధికారులు వెల్లడించారు. ఇటీవల బంగ్లా మహిళా క్రికెట్‌ జట్టు జింబాబ్వే నుంచి స్వదేశానికి తిరిగివచ్చింది. ఒమిక్రాన్‌ బాధిత మహిళా క్రికెటర్లును క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరో రెండు వారాల్లో పూర్తిగా కోలుకుంటారని బంగ్లా ఆరోగ్యశాఖ మంత్రి జాహిద్‌ ఆదివారం తెలిపారు. బాధిత క్రికెటర్ల పేర్లను వెల్లడించలేదు. వీరితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం జట్టు మొత్తం క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement