Friday, November 22, 2024

RCB: రంగు మారింది….మ‌రి ఆర్సీబి ద‌శ మారుతుందా…

ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ లలో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 6 మ్యాచ్‌ లలో ఓటమిపాలైంది. దీనితో ప్రస్తుతం బెంగళూరు జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయిన ఆర్సీబీ ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది.

- Advertisement -

ఇకపోతే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆర్‌సీబీ జట్టు ‘గో గ్రీన్‌ డే’ సంప్రదాయాన్ని కొనసాగించబోతోంది. ఇందులో భాగంగా కోల్కతాతో మ్యాచ్‌ లో ఆర్సీబీ జట్టు గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సంప్రదాయం 2011 ఐపిఎల్ ఎడిషన్ నుండి, ఆర్సీబీ సీజన్‌ లోని ఒక మ్యాచ్‌ లో ఆకుపచ్చ జెర్సీని ధరిస్తుంది. ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్’ గురించి క్రికెట్ ప్రేమికులకు అవగాహన కల్పించేందుకు ఈ గ్రీన్ జెర్సీని ధరించనుంది.
ప్రతి ఏడాదిలాగే., ఈ ఏడాది కూడా ఆర్సీబీ జట్టు కోల్కతాలో కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్‌ లో ఆకుపచ్చ జెర్సీలో ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఈ జెర్సీ టీ షర్ట్‌ లో ఆకుపచ్చ, నీలం రంగులను జట్టు యాజమాన్యం ఉపయోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement