Sunday, October 6, 2024

Tennis | కోకో గాఫ్‌ ఔట్‌… క్వార్టర్స్‌లో రిబాకీనా, డి మీనార్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌, అమెరికా యువ సంచనలనం కోకోగాఫ్‌కు షాక్‌ తగిలింది. ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌లోనే గాఫ్‌ ప్రయాణం ముగిసింది. మరోవైపు నాలుగో సీడో ఎలినా రిబాకినా, 13వ సీడ్‌ ఒస్టాపెంకో, స్వీటొలినా, అలెక్స్‌ డి మీనార్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు.

సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రౌండ్‌-16లో అమెరికాకు చెందిన 19వ సీడ్‌ ఎమ్మా నావారో 6-4, 6-3 తేడాతో అమెరికాకే చెందిన రెండో సీడ్‌ కోకో గాఫ్‌పై సంచలన విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది.

మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌, నాలుగో సీడ్‌ ఎలినా రిబాకినా (కజకిస్తాన్‌) 6-3, 3-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి అన్నా కలిన్‌స్కయా (రష్యా) గాయంతో ఆట మధ్యలోనే వెనుదిరిగింది. దీంతో చైర్‌ అంపైర్‌ రిబాకినాకు విజేతగా ప్రకటించారు.

మ‌రో మ్యాచ్‌లో 21 సీడ్‌ ఎలినా స్వీటొలినా (ఉక్రెయిన్‌) 6-2, 6-1 తేడాతో చైనాకు చెందిన వాంగ్‌ జిన్‌యూను వరుస సెట్‌లలో చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించింది. మరోవైపు 13వ సీడ్‌ ఒస్టాపెంకో 6-2, 6-3తో యులియా పుటిన్సెవాపై నెగ్గి నాకౌట్‌కు అర్హత సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌.. 9వ సీడ్‌ అలెక్స్‌ డి మీనార్‌ 6-2. 6-4, 4-6, 6-3 తేడాతో ఆర్థర్‌ ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి తొలిసారి వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో లొరెన్జో ముసెటీ (ఇటలీ) 4-6, 6-3, 6-3, 6-2తో గివానీ పెరీకార్డ్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి ముందంజ వేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement