ఫారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి కోకో గౌఫ్ అద్భుతంగా రాణించింది. 18ఏళ్ల కోకో గౌఫ్ సెమీస్‌లో ట్రెవిసన్‌పై 6-3, 6-1తేడాతో గెలుపొందింది. దీంతో కోకో తన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో కోకో గౌఫ్, ట్రెవిసన్ తొలిసారిగా గ్రాండ్ స్లామ్ పోటీల్లో తమ తొలి సెమీఫైనల్ ఆడారు. 2004లో వింబుల్డన్ గెలిచిన మరియా షరపోవా తర్వాత గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత పిన్న వయస్కురాలుగా గౌఫ్ రికార్డులకెక్కింది. శనివారంనాడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా 34 మ్యాచ్‌లు గెలిచిన స్విటెక్‌తో 18వ సీడెడ్ ప్లేయర్ కోకో గౌఫ్ తలపడనుంది.
ఇక మహిళల డబుల్స్ విభాగంలో సెమీస్‌లో ఒస్టాపెన్‌కో, కిచినాక్ ద్వయం తమ ప్రత్యర్థి గార్సియా-వ్లూడెనోవిక్ జోడీపై 6-2తో తొలి గేమ్‌లో గెలవగా, తర్వాత గేమ్‌లో 4-6తేడాతో ఓటమిని చవిచూసింది. పెగుల్లా-గౌఫ్ జోడీ తన ప్రత్యర్థి టౌన్‌సెండ్, కీస్ ద్వయంపై 6-4, 7-6తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..