టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసిస్తూనే.. మరోవైపు భవిష్యత్తులో కష్టాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అదృష్టంతో నెట్టుకొస్తున్నాడన్న ప్రస్తుతం జట్టులో చేస్తున్న ప్రయోగాలు అంత మంచివి కావని, భవిష్యత్తులో కష్టాలు తెచ్చిపెడ్తాయని చెప్పుకొచ్చాడు. ఇలాగే ప్రయోగాలు కొనసాగిస్తే.. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్‌కు టీమిండియా సిద్ధం కాదన్నాడు. సారథ్యబాధ్యతలు నుంచి కోహ్లీ తప్పుకున్న తరువాత.. టీమిండియా పగ్గాలను రోహిత్ అందుకున్నాడు.
రోహిత శర్మ ప్రశాంతమైన కెప్టెన్ అని, అతని సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంటోందన్నారు. కాకపోతే టీమిండియా ఇంకా సెట్ అవ్వలేదన్నారు. ప్రతీ సిరీస్‌కు జట్టును మారుస్తూ ప్రయోగాలు చేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే.. జట్టు అగమ్య గోచరంగా తయారవుతుందని హెచ్చరించాడు. ఓపెనర్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదని, ఒక్కో సిరీస్‌కు ఒక్కో ప్లేయర్‌తో రోహిత్ ఓపెనింగ్ చేస్తున్నాడని, జట్టు సెట్ కాలేదనడానికి ఇదే ఉదాహరణ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..