Sunday, December 29, 2024

Wishes : క్రికెటర్ నితీశ్ రెడ్డికి సీఎం చంద్రబాబు విషెస్

అమరావతి: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విశాఖపట్నం యువకుడు నితీశ్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు.

అరంగేట్ర సిరీస్ లో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కావడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. గతంలో రంజీలో, అండర్-16లో కూడా అద్భుత విజయాలు అందుకున్నాడని గుర్తుచేశారు. నితీశ్ ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement