(ఆంధ్రప్రభ, విజయవాడ) : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ శాఖలలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నిర్వహించే ఈ పోటీలు నవంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి.
18 క్రీడాంశాలకు సంబంధించి ఉద్యోగులకు పోటీలను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయా జిల్లాలలో ప్రత్యేక గుర్తించిన అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్, విజయవాడలోని డిఆర్ఎంఎస్ స్టేడియం ఐ జి ఎం స్టేడియం, మంగళగిరి ఏసీఎస్ స్టేడియం, వంటి ప్రాంతాలలో ఈ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.