యాషెస్ హీరో క్రిస్ వోక్స్ జూలై నెలకి సంబంధించిన ‘ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సోంతం చేసుకున్నాడు. స్వదేశం లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఈ ఇంగ్లండ్ పేసర్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి. అయితే, ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే, నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డి లీడ్ నిరాశపరిచారు. కంగారూల చేతిలో ఓడినప్పటికీ ఇంగ్లండ్‌కు చెందిన వోక్స్ సూపర్ స్పెల్‌తో సిరీస్‌ను గెలుచుకున్నాడు.
మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 19 వికెట్లు తీసాడు. ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్‌ని 2-2తో డ్రా చేయడంలో వోక్స్ కీలక పాత్ర పోషించాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. “ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సమిష్టి కృషితోనే యాషెస్ సిరీస్‌ను సమం చేశాం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించడం వల్లే నాకు ఈ అవార్డు లభించిందని’’ వోక్స్ చెప్పాడు.
గార్డనర్ కొత్త రికార్డు..
మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును అందుకుంది. దాంతో వరుసగా రెండోసారి ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ అవార్డు కోసం ఆసీస్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ పోటీ పడ్డారు. అయితే, గార్డనర్‌కు పోలింగ్‌లో ఎక్కువ ఓట్లు రావడంతో, ICC ఆమెను విజేతగా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టులో ఆఫ్ స్పిన్నర్ 12 వికెట్లు పడగొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దాంతో జూన్ నెలలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకుంది గార్డనర్.