సింగపూర్: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డిఫెడింగ్ ఛాంప్ డింగ్ లిరెన్ (చైనా) భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్కోరును 6-6తో సమం చేశాడు. సోమవారం జరిగిన 12వ రౌండ్‌లో చైనా స్టార్ లిరెన్ గుకేశ్‌పై విజయం సాధించాడు. పదకొండో రౌండ్‌లో యువ సంచలనం గుకేశ్ విజయంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. తాజాగా మ్యాచ్‌లో లిరెన్ పైచేయి సాధించాడు.
ఆది నుంచే దూకుడుగా ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ గుకేశ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే గుకేశ్ ఓటమితో 12వ రౌండ్‌ను ముగించాడు. ఇక ఇద్దరి మధ్య ఇంకా రెండు గేమ్‌ల అటే మిగిలి ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయానికి 1.5 పాయింట్ల దూరంలో నిలిచారు. ముందు ఎవరూ 7.5 పాయింట్స్ సాధిస్తారో వారే విశ్వవిజేతగా అవతరిస్తారు.