Saturday, November 23, 2024

Chess | ప్ర‌పంచ టాప్ 10 లో ముగ్గురు ఇండియ‌న్స్ ..

భారత చెస్‌ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్‌ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్‌) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్‌లు టాప్‌-10లో నిలిచారు. 2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్‌ ఏడులో, ఆర్‌ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు.

భారతీయ చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్‌ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్‌ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్‌ లిస్ట్‌ టాప్‌ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్‌, ప్రజ్ఞానంద, విశ్వనాథన్‌ ఆనంద్‌, విదిత్‌ సంతోష్‌ గుజరాతీ, అరవింద్‌ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్‌ సరిన్‌, ఎస్‌ ఎల్‌ నారాయణన్‌, సద్వాని రౌనక్ ఉండటం గమనార్హం.

మహిళల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్‌ లిస్ట్‌ టాప్‌-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్‌ వరల్డ్‌ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement