భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటాడు. మొన్న ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ కార్లోస్‌ను ఓడించిన ప్రజ్ఞానంద, ఆదివారం ప్రపంచ నంబర్ 2 ఫాబియానో కురువానాకు షాకిచ్చాడు. 2024 నార్వే చెస్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన గేమ్‌లో ఐదవ రౌండ్‌లో తెల్ల పావులతో ప్రజ్ఞానంద ఆడాడు.
వరుసగా టాప్ ప్లేయర్లను ఓడించడం ద్వారా అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐడీఈ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్10లోకి దూసుకొచ్చాడు. నాలుగు ర్యాంకులను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం పదవ స్థానంలో నిలబడ్డాడు. మొన్నటి గేమ్‌లో ఐదుసార్లు ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఇదే టోర్నీలో మూడవ రౌండ్‌లో ప్రజ్ఞానంద ఓడించాడు.
ఈ మ్యాచ్‌ను కేవలం 37 ఎత్తుల్లోనే సొంతం చేసుకున్నాడు. గతంలోనూ ర్యాపిడ్/ఎగ్జిబిషన్ గేమ్స్‌లో పలుమార్లు కార్ల్‌సన్‌ను ఖంగు తినిపించాడు. నాలుగో రౌండ్‌లో అమెరికాకి చెందిన హికారు నకమురా చేతిలో ఒటమి పాలైన ప్రజ్ఞ, తర్వాతి రౌండ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు.
ఒకే టోర్నీలో ఇద్దరు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఓడించడం ప్రజ్ఞానందకు ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఐదు రౌండ్ల తర్వాత టోర్నీలో 8.5 పాయింట్లతోమన గ్రాండ్ మాస్టర్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. మరో ఐదు రౌండ్లు మిగిలివున్నాయి.