చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఇవ్వాల (బుధవారం) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొద్ది సేపట్లో ఆట ప్రారంభం కాబోతోంది.. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. చివరి దశకు చేరుకున్న ఐపీఎల్ లో ఒక జట్టు గెలుపు-ఓటములు మరో జట్టు మనుగడను నిర్ణయిస్తున్నాయి. కాగా, ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎంఏ చిదంబరం స్టేడియంలో డేవిడ్ వార్నర్‌కి చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది .
11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 విజయాలు, 4 ఓటములతో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో చెన్నై గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్ దశకు చేరినట్లే.
ఇక.. CSK జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీతో కీలకపోరులో ఢిల్లీ విజయం సాధించింది. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే, మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది. ఆరంభంలో ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మినహా మరెవరూ పరుగులు చేయడం లేదు. ఢిల్లీ బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తోంది.