Friday, November 22, 2024

Breaking: టార్గెట్ చేజింగ్‌లో కుప్ప‌కూలిన చెన్నై టాపార్డ‌ర్‌.. ఇక భార‌మంతా ధోనీపైనే..

టీ20 మ్యాచులంటే వారికి ఎంతో ఈజీ.. ప్ర‌తి సీజ‌న్‌లోనూ టాప్ ప్లేయ‌ర్స్‌గా రాణిస్తున్నారు ఎల్లో ఆర్మీ. కానీ ఈసారి మాత్రం ఆది నుంచి అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. ఆట‌తీరు ఏమాత్రం బాగాలేదు. ఇవ్వాల పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13), మోయిన్ అలీ (0), ర‌వీంద్ర జ‌డేజా (0), బ్రావో (0) డ‌క్ అవుట్ అయ్యి నిరాశ‌తో పెవిలియ‌న్ చేరారు. ఇక శివం దూబే ఒక్క‌డే రెండంకెల స్కోరు (57) చేసి చేసి అవుట‌య్యాడు. టాపార్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్ అంతా స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మొయీన్ అలీ (0).. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో అర్షదీప్ బౌలింగ్‌లో.. చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా (0) కూడా డకౌట్ అయ్యాడు.

కాసేపటికే 8వ ఓవర్లో ఒడియన్ స్మిత్ వేసిన బంతికి అంబటి రాయుడు (13) కూడా పెవిలియన్ చేరాడు. స్మిత్ వేసిన షార్ట్ పిచ్ బంతి.. రాయుడు గ్లవ్స్‌కు తగిలి వెనక్కు వెళ్లింది. దాన్ని కీపర్ జితేష్ శర్మ డైవ్ చేసి అందుకోవడంతో రాయుడు నిరాశగా వెనుతిరిగాడు. దీంతో 36 పరుగులకే చెన్నై జట్టు సగం వికెట్లు కోల్పోయినట్లయింది. ప్రస్తుతం క్రీజులో ధోనీ, దూబే ఉన్నారు. చెన్నైను ఒడ్డుకు చేర్చే భారం ఇప్పుడు వీళ్లపైనే ఉంది. చెన్నై అభిమానులంతా ధోనీపైనే ఆశలు పెట్టుకొని ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement