ఐపీఎల్లో ఇవ్వాల (శనివారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబైపై చెన్నై విజయకేతనం ఎగరేసింది. ముంబై జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, కాన్వే (0), అజింకా రహానే 61, శివమ్ దూబే (28) చేసి అవుటయ్యారు.. ఇక.. రుతురాజ్ గైక్వాడ్ 40, అంబటి రాయుడు 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
కాగా, ఐపీఎల్ 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 157 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(31), తిలక్ వర్మ(22), టిమ్ డేవిడ్ (31) మాత్రమే రాణించారు. ప్రిటోరియస్ వేసిన ఆఖరి ఓవర్లో హృతిక్ ష్లోకీన్ (18) మూడు బౌండరీలు కొట్టాడు. దాంతో, ముంబై స్కోర్ 150 దాటింది.
ఇక.. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. శాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు తీశారు. సిసండ మగలకు ఒక వికెట్ దక్కింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కింది. అయితే.. తుషార్ దేశ్‌పాండే రోహిత్ శర్మ(21) బౌల్డ్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ ఇషాన్ కిషన్(31)ను జడేజా ఔట్ చేశాడు.
64 వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడ్డాయి. సూర్యకుమార్ యాదవ్(1), కామెరూన్ గ్రీన్(12), అర్షద్ ఖాన్ వెంట వెంటనే ఔటయ్యారు. తిలక్ వర్మ(22), టిమ్ డేవిడ్ (31), హృతిక్ ష్లోకీన్ (18) ధాటిగా ఆడడంతో ముంబై పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.