అహ్మదాబాద్ స్డేడియంలో ఇవ్వాల ఆడుతున్న వన్డే క్రికెట్లో ఇండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. టీమిండియా బౌలర్ల దాటికి వెస్టిండీస్ జట్టు పేకమేడలా కూలిపోయింది. ODI కెప్టెన్ రోహిత్ శర్మ 1000వ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంతా అనుకున్నట్టే ఈ మ్యాచ్లో వెస్టిండిస్ను 176 పరుగులకే ఆలౌట్ చేసి అనుకున్నది సాధించారు.
యుజ్వేంద్ర చాహల్ (4/49), వాషింగ్టన్ సుందర్ (3/30) వికెట్లు తీసుకుని వెస్టిండీస్ బ్యాటింగ్ ని దెబ్బతీశారు. కాగా, వెస్టిండీస్ 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంట్లో జాసన్ హోల్డర్ 57 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. భారత్ తన 1000వ వన్డేలో వెస్టిండీస్పై గెలవాలంటే 177 పరుగులు చేయాల్సి ఉంది.
అయితే అహ్మదాబాద్ స్టేడియంలో సాయంత్రం కురిసే మంచును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భారత శిబిరంలో చాలా మంది గాయాలపాలు కాగా, కరోనా పాజిటివ్‌తో చివరి నిముషంలో వన్డే మ్యాచ్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో టాపార్డర్లో చాలా చేంజెస్ జరిగే చాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చాడు. కెఎల్ రాహుల్ లేకపోవడంతో దీపక్ హుడా అరంగేట్రం చేశాడు.