భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ వన్డేల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని స్పీడ్‌గా అందుకున్న భారత ఐదో బౌలర్‌గా నిలిచాడు చాహల్. ఇవ్వాల (ఆదివారం) జరుగుతున్న మ్యాచ్‌లో సమరాహ్ బ్రూక్స్ (12), నికోలస్ పూరన్ (18), కీరన్ పొలార్డ్ (0), ఎ జోసఫ్(13)ను వరుస ఓవర్లలో చాహల్ పెవిలియన్ బాట పట్టించాడు.
చాహల్ విసిరిన బంతిని స్వీప్ చేయబోయి నికోలస్ పూరన్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోగా.. కెప్టెన్ కీరన్ పొలార్డ్ గూగ్లీని అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డయ్యాడు. అదీ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే పొలార్డ్ ఔటవడం గమనార్హం. వన్డేల్లో వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. మహ్మద్ షమీ కేవలం 56 వన్డేల్లో ఈ మార్క్‌ని చేరుకోగా.. జస్‌ప్రీత్ బుమ్రా 57 వన్డేల్లో, కుల్దీప్ యాదవ్ 58 వన్డేల్లో, ఇర్ఫాన్ పఠాన్ 59 వన్డేల్లో 100 వికెట్ల మార్క్‌ని చేరుకున్నారు. తాజాగా చాహల్ తన 60వ వన్డేలో 100వ వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్లలో చాహల్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రికార్డ్‌లో అనిల్ కుంబ్లే 334 వికెట్లతో టాప్‌లో ఉండగా.. హర్భజన్ సింగ్ (265), రవీంద్ర జడేజా (188), సచిన్ టెండూల్కర్ (154), రవిచంద్రన్ అశ్విన్ (151), రవిశాస్త్రి (129), యువరాజ్ సింగ్ (110), కుల్దీప్ యాదవ్ (107) టాప్-8లో కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..