వెస్టిండీస్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న బ్రాత్‌వైట్‌కు.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ కౌంటీ యాజమాన్యం ప్రకటించింది. కాగా, ప్రస్తుత టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన బ్రాత్‌వైట్.. 18 వికెట్లు పడగొట్టి, 104 పరుగులు చేశాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరి ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాది వెస్టిండీస్‌ని గెలిపించిన కార్లోస్ బ్రాత్‌వైట్.. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా కరీబియన్ జట్టును కూడా నడిపించాడు. అయితే, 2019 నుంచి అతని కెరీర్ గాడి తప్పిడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక నిన్న నాటింగ్హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌కి అతని స్థానంలో రోబ్ యాట్స్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20 బ్లాస్ట్ టోర్నీ నిబంధనల ప్రకారం.. కరోనా పాజిటివ్‌గా తేలిన క్రికెటర్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో జులై 9న జరిగే మ్యాచ్‌కి కూడా ఈ స్టార్ పవర్ హిట్టర్ దూరంగా ఉంటాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: మిథాలీ రాజ్ అరుదైన రికార్డ్..