జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్‌కప్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. 15 మందితో కూడిన శ్రీలంక జట్టుకు స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ సారథ్యం వహించనున్నాడు. చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
మాజీ కెప్టెన్ దుసన్ శనకతో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా సెలెక్టర్లు ఈ స్క్వాడ్‌లో చోటు కలిపించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న మతీశ పతిరణ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. అలాగే నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లను కూడా లంక బోర్డు ఎంపిక చేసింది. ఇక ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో జూన్ 3న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
శ్రీలంక ప్రపంచకప్ జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీశ పతిరణ, దిల్షన్ మధుశంక.
ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు: అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియస్‌కాంత్, భానుకా రజపక్సే, జనిత్ లియనాగే.