టీమిండియా ఆల్ రౌండర్, సీఎస్‌కే మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజాపై భారత్ జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై జడేజాను రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుందని, ఇటీవల పరిణామాలు చూస్తుంటే.. వచ్చే ఏడాది కెప్టెన్‌గా జడ్డూను ఎంపిక చేయడం కష్టమే అన్నాడు. ధోనీ సైతం..కెప్టెన్సీ జడ్డూ ఆటపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపాడు. ఒక వేళ సీఎస్‌కే జడేజాను రిలీజ్ చేస్తే.. వారికి రూ.16 కోట్లు మిగులుతాయోమో కానీ.. అలాంటి ఆటగాడు మళ్లిd ఎప్పటికీ దొరకడని చెప్పుకొచ్చాడు. డ్వేన్ బ్రావోను సీఎస్‌కే ఇంకా ఎన్నాళ్లు కొనసాగిస్తుందని ప్రశ్నించాడు.
బౌలర్‌గా అతను మరో సీజన్‌లోనూ రాణిస్తాడెమో కానీ.. అతడి కోసం రూ.4.4 కోట్లు ఖర్చు చేశారన్నారు. బ్రావో రోజురోజుకూ యువకుడు కావడం లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. బ్రావో స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..