Friday, November 22, 2024

బజ్‌ బాల్‌ విధానం కరెక్టే: కెఎల్‌ రాహుల్‌

గత కొన్ని నెలలుగా ఇంగ్లిష్‌ క్రికెటర్లు దూకుడు శైలిని అవలంబిస్త్తున్నారు. ఇటీవలె వాళ్లు బజ్‌ బాల్‌ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ విధానం వల్లే పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచులో ఇంగ్లండ్‌ విజయ కేతనం ఎగరేసింది. బజ్‌ బాల్‌ విధానాన్ని వన్డే సిరీస్‌ కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ ఆమోద ముద్ర వేసాడని వినిపిస్తుంది. ఇంగ్లండ్‌ క్రికెటర్లని రాహుల్‌ అభినందించాడు. బజ్‌ బాల్‌ విధానం వల్ల టెస్ట్‌ క్రికెట్‌లో మార్పులు తీసుకువచ్చిందని రాహుల్‌ అన్నారు. పర్సనల్‌గా బజ్‌ బాల్‌ విధానం తన కిష్టమని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇంగ్లండ్‌ క్రికెటర్ల అటాకింగ్‌ స్టైల్‌ చాలా బాగుంటుందని, బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో తాము కూడా ఇంగ్లండ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తామని ప్రి మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అన్నాడు. కాగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా కెఎల్‌ రాహుల్‌ ఎంపికైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు బజ్‌ బాల్‌ విధానాన్ని అనుసరించి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement