ప్రైజ్‌మనీలో బట్లర్ హవా చూపించాడు. రన్స్‌తో పాటు ప్రైజ్ మనీలోనూ దుమ్ములేపాడు. ఈ సీజన్‌లో ఏకంగా 37 అవార్డులు అందుకున్నాడు. వాటి ద్వారా రూ.95లక్షల ప్రైజ్‌మనీ ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్ అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ ్ట వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లే ప్లేయర్ పురస్కారాలతో రూ.60లక్షలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 57.53 సగటుతో 863 పరుగులు చేసి టాప్‌లో నిల్చున్నాడు. నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో తన సత్తా ఏంటో నిరూపించాడు.
ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన బట్లర్‌కు రూ.10లక్ష క్యాష్ రివార్డు అందజేశారు. ఈ సీజన్‌లో 45 సిక్సులు, 83 ఫోర్లు కొట్టాడు. ఈ కేటగిరిలో రూ.10లక్షల చొప్పున రూ.20 లక్షలు అందుకున్నాడు. ప్రతీ అవార్డుకు పదే లక్షలు అందుకుని ఔరా అనిపించాడు. లీగ్ స్టేజీలో రెండుసార్లు, క్వాలిఫయర్2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద రూ.7లక్షల జేబులో వేసుకున్నాడు. వివిధ మ్యాచుల్లో.. పవర్ ప్లేయర్, గేమ్ ఛేంజర్, మోస్ ్ట ఫోర్స్, మోస్ ్ట సిక్సర్స్, అవార్డులతో రూ.28లక్షల వరకు సంపాదించుకున్నాడు. ఈ లెక్కన మొత్తం రూ.98లక్షల అవార్డుల ద్వారానే పొందాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..