ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న 40వ సబ్ జూనియర్, 50వ జూనియర్ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ కుమార్ టీఎస్ తేజస్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో స్విమ్మర్ తేజస్ మూడో స్థానంలో నిలవగా.. మొదటి రెండో స్థానాల్లో.. మిజోరాంకు చెందిన లాంచెన్‌బా లైటోంజమ్, కర్ణాటకకు చెందిన థాకురియా అక్షజ్ రెండో స్థానాల్లో నిలిచారు.
తేజస్ కాంస్య పతకం సాధించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పదించారు. కాంస్య పతకం గెలుచుకున్న తెలంగాణ బిడ్డ తేజస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాభినందనలు తెలిపారు. తేజస్ అద్భుత ప్రదర్శన తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే రాణించి.. మరిన్నో విజయాలను సాధించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.