భారత మహిళా క్రికెట్ అంపైర్ వృందా ఘనశ్యామ్ రాఠీ కొత్త చరిత్ర సృష్టించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌తో తొలి భారతీయ మహిళా టెస్ట్ అంపైర్‌గా అంపైర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టింది. 2014లో ముంబయి క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వృంద.. ఆ తర్వాత 2018లో బీసీసీఐ నిర్వహించిన పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. 2020లో ఐసీసీ డెవలప్‌మెంట్ ప్యానెల్ ఆఫ్ అంపైరింగ్‌కు కూడా ఆమె ప్రమోషన్ పొందింది.
2022లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా రాఠీ అంపైర్‌గా వ్యవహరించింది. ఈ ఏడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ అంపైర్‌గా వ్యవహరించింది. ముంబైకి చెందిన 34 ఏళ్ల వ్రింద 13 మహిళల వన్డేలలో, 43 టీ20లలో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మీడియం పేసర్ అయిన వృంద తన కాలేజీ రోజుల్లో నాలుగేళ్లపాటు ముంబయి యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది.