Thursday, September 19, 2024

Asia Cup | రాణించిన బౌలర్లు… శ్రీలంక ముందు ఈజీ టార్గెట్

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా ఈరోజు జరిగిన‌ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. శ్రీలంక బౌల‌ర్లు చెల‌రేగడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధని (20/2), ఇనోషి ప్రియదర్శని (17/2) బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను చిత్తు చేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమైంది.

అయితే, బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా (48 నాటౌట్) శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డుకు పరుగులు జోడించింది. ఆక‌ర్లో షోర్నా అక్త‌ర్ (25) రాణించింది. ఇక మిగిలిన‌వారు 10 ప‌రుగుల లోపే పెవిలియ‌న్ చేర‌డంతో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక ముందు 112 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement