హైదరాబాద్, ఆంధ్రప్రభ : త్వరలో బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తానని కామన్ వెల్త్ క్రీడల్లో విజేత, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు పాఠశాల్లో కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్ ్స అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఆధ్వర్యంలో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్మనపల్లి జగన్‌మోహన్ రావు నిర్వహించిన మీట్ ద ఛాంపియన్‌లో పాల్గొన్న నిఖత్ జరీన్ పాల్గొని మాట్లాడారు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమం అద్భుతంగా ఉందని తెలిపారు. క్రీడాకారులతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా దాని వలన ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆకుకూరలు, పాలు , గుడ్లు వంటి ఎంపిక చేసిన పోషకాహారం, ప్రోటీన్స్ కలిగిన మాంసహారాన్ని డైల్‌లో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాయమం కోసం సమయం కేటాయించాలని ఆమె సూచించారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని ఆమె పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement