Tuesday, November 26, 2024

బాక్సర్ లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం..

టొక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన అసోం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు ప్రకటించింది. లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్‌ చేయడంతో పాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లవ్లీనాకు గురువారం గౌహతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  ఈ సందర్భంగా సీఎం బాక్సర్ లవ్లీనాను రాష్ట్ర పోలీసుశాఖలో డీఎస్‌పీగా చేరమని అభ్యర్థించారు. అంతేకాక ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అలానే లవ్లీనా కోచ్‌కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం. గోలాఘాట్ జిల్లాలోని సౌపాతర్‌లో లవ్లీనా బోర్గోహెయిన్‌ పేరు మీద రూ. 25 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు హిమంత శర్మ తెలిపారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ స్వయంగా గౌహతి విమాన్రాశయం చేరుకుని లవ్లీనాకు స్వాగతం పలికారు. అనంతరం బాక్సర్‌ భారీ కటౌట్‌లతో అలంకరించిన బస్సులో లవ్లీనాను ఎక్కించుకుని సిటీ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లవ్లీనాకు సన్మానం జరిగింది. సాయంత్రం లవ్లీనా..  గవర్నర్ జగదీష్ ముఖిని కూడా కలిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: దేశంలో ఉపఎన్నికల నిర్వహణపై సీఈసీ ట్విస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement