Friday, November 22, 2024

Sunrisers : తిరిగి పుంజుకుంటాం…. స‌న్ కెప్టెన్ క‌మిన్స్

200 పరుగులు చేయడం చాలా సులువు, 250+ పరుగులు చేయడం కూడా కష్టతరం కాదని నిరూపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా డీలాపడింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 134 పరుగులకే ఆలౌటైంది.

- Advertisement -

హోరాహోరీగా ఛేదన సాగుతుందనకుంటే కనీస పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి 78 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

కాగా, మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమికి గల కారణాలు వివరించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై స్పందిస్తూ.. మొదట ఫీల్టింగ్ ఎంచుకోవడం ఓటమికి కారణం కాదని పేర్కొన్నాడు. ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామని, కానీ దురదృష్టవశాత్తు పరాజయాన్ని చవిచూశామని కమిన్స్ అన్నాడు.
”విజయం సాధించడానికి ఛేదన ఉత్తమ మార్గంగా భావించాం. కానీ దురదృష్టవశాత్తు మంచి ఫలితం రాలేదు. వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ సహకరించింది. మాకు అదే పరిస్థితి ఉంటుదని అనుకున్నాం. ఇక మా బ్యాటింగ్ లైనప్ గురించి సంతోషంగానే ఉన్నాం. ఇవాళ మాత్రమే మేం గెలవలేకపోయాం. ఈ సీజన్‌లో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లను మా బ్యాటింగ్ లైనప్‌లోని ఆటగాళ్లే గెలిపించారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో కూడా మంచు ప్రభావం చూపించింది. ఇది కేవలం రెండు వరుస పరాజయాలు. తిరిగి త్వరగా పుంజుకుంటాం” అని కమిన్స్ అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement