Tuesday, November 19, 2024

Buzzball : పాక్ లో పుట్టింది…భార‌త్ లో చ‌చ్చింది..

ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. భారత్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 4-1 తేడాతో చిత్తయ్యింది. బజ్‌బాల్ అప్రోచ్‌తో పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడిన ఇంగ్లండ్.. వరుసగా నాలుగో మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. హైదరాబాద్ టెస్ట్‌లో విజయం సాధించి ఈ సిరీస్‌లో శుభారంభం చేసిన ఆ జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది.

ముఖ్యంగా ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెట్టి అసలు సిసలు టెస్ట్ క్రికెట్ ఆడాలని ఇప్పటికే మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ వంటి మాజీ క్రికెటర్లు సూచించగా.. ఓ ప్రణాళిక, పద్దతిలేని పిచ్చి అప్రోచ్‌తో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు.

- Advertisement -

అభిమానులు అయితే ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతున్నారు. పాకిస్థాన్‌లో పుట్టిన బజ్‌బాల్.. భారత్‌లో చచ్చిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇంగ్లండ్ ఈ బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెడుతుందా..? కొనసాగిస్తుందా? అనేది చూడాలని ట్వీట్ చేస్తున్నారు. బజ్‌బాల్‌తో పాకిస్థాన్‌లో గెలిచిన ఇంగ్లండ్ తాజా సిరీస్ లో భారత్‌లో మాత్రం తేలిపోయిందని సెటైర్లు పేల్చుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement