Tuesday, October 29, 2024

Tennis | ఏటీపీ ఫైనల్స్‌కు బోపన్న-ఎబ్డెన్‌ జోడీ

భారత స్టార్‌ టెన్నిస్‌ డబుల్స్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వీరు వరుసగా రెండో ఏడాది ఈ మెగా టోర్నీకి అర్హత సాధించడం విశేషం.

దీంతో ఈ ప్రతిష్టాత్మకమై టోర్నీలో అడే అవకాశం దక్కించుకున్న నాలుగో భారతీయుడిగా బోపన్న రికార్డు సృష్టించాడు. ఇటలీ వేదికగా నవంబర్‌ 10 నుంచి ఏటీపీ ఫైనల్స్‌ పోటీలు జరగనున్నాయి. తన ఆస్ట్రేలియా పార్ట్‌నర్‌ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి 43 ఏళ్ల రోహన్‌ బోపన్న బరిలోకి దిగనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement