ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. ఈ కీలకపోరులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకంది. కాగా, భారత బౌలర్లు విజృంభించి ఆడడంతో ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది లంక జట్టు. పిడుగుల వంటి బంతులతో బౌలర్ సిరాజ్ విరుచుకుపడడంతో లంక బ్యాటర్లు దిక్కుతోచక వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఈ క్రమంలో 4 ఓవర్లలోనే కీలకమైన 5 అయిదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 12వ ఓవర్ వరకు 8 వికెట్లు నష్టపోయిన లంక కేవలం 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక జట్టును కోలుకోకుండా చేశాడు.15 ఓవర్లకే లంక జట్టు ఆల్ అవుట్ అయ్యింది.
ఇక.. శ్రీలంక బ్యాటర్లలో అత్యధిక పరుగులు 17 చేసిన వారిలో మెండిస్ ఉన్నాడు. అయిదురుగు బ్యాటర్లు డక్ అవుట్ అయ్యారు. డక్ అవుట్ అయన వారిలో కుశాల్, సదీర, సరిత్ అసలంక, ధనుష్ శనాకా, మతీశ పతిరానా ఉన్నారు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, మహ్మద్ సిరాజ్ 6, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.
ఇక భారత జట్టు 50 ఓవర్లకు 51 పరుగులు చేయాల్సి ఉంది.. అంటే నిదానంగా ఆడుకున్నా ఈ ఫైనల్ మ్యాచ్‌ని అలవోకగా గెలుపొందొవచ్చు.
ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ శ్రీలంకకు చుక్కలు చూపించాడు. ఈ స్పీడ్‌స్టర్ మూడు ఓవర్లలోనే కీలకమైన ఐదు వికెట్లు తీసి లంకను చావు దెబ్బకొట్టాడు. ఏకంగా ఓకే ఓవర్లో 4 కీలక వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఆ తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో లంక కెప్టెన్ దసున్ శనక(0)ను బౌల్డ్ చేశాడు. సిరాజ్ ధాటికి నలుగురు శ్రీలంక బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.