Tuesday, November 26, 2024

బూమ్‌.. బూమ్‌.. బుమ్రా.. ఐదు వికెట్లతో మెరిసిన జస్ప్రిత్‌

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా రెచ్చిపోయాడు. 5/42తో ఔరా అనిపించాడు. నాలుగేళ్ల క్రితం ఇదే మైదానంలో టెస్టు ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. సఫారీల పతనాన్ని శాసించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 76.3 ఓవర్స్‌లో 210 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది. కీగన్‌ పీటర్సన్‌ (72) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బుమ్రాకు తోడుగా ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. 17/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే మర్‌క్రమ్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. పీటర్సన్‌తో కలిసి కేశవ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడిలో కేశవ్‌ (25)ని ఉమేష్‌ విడదీశాడు. కేశవ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో 45 రన్స్‌్‌కే 3 వికెట్లు కోల్పోయింది. డస్సెన్‌తో కలిసి పీటర్సన్‌ జట్టును ఆదుకున్నాడు. భారత్‌ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి సఫారీ జట్టు 100/3 వద్ద నిలిచింది.

బుమ్రా పాంచ్‌ పటాకా..
డస్సెన్‌, పీటర్సన్‌ జోడీని మళ్లి ఉమేశ్‌ యాదవ్‌ విడదీశాడు. డస్సెన్‌ (21) స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 67 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. బవుమాతో కలిసి పీటర్సన్‌ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా ఇచ్చిన క్యాచ్‌ను పుజారా అందుకోలేకపోయాడు. ఈ జోడీని షమీ విడదీశాడు. స్లిప్‌లో బవుమా (28) ఇచ్చిన ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ తరువాత వచ్చిన వారు ఎవరూ అంతగా రాణించలేదు. కైల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా బౌలింగ్‌లో జాన్సెన్‌ (7) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హాఫ్‌ సెంచరీతో రాణించిన పీటర్సన్‌ (72) బుమ్రా బౌలింగ్‌లో పుజారాకు చిక్కాడు. ఆ తరువాత రబాడా (15), ఒలివర్‌ (10 నాటౌట్‌)గా నిలిచాడు. చివరి వికెట్‌గా ఎంగిడిని బుమ్రా పెవిలియన్‌ పంపించడంతో సఫారీ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే నిలుపుకోగలిగింది.

భారత్‌కు ఆదిలోనే భారీ షాక్..
13 రన్స్‌ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు ఔటయ్యారు. రబాడా బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (7) ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ వెంటనే జాన్సెన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ (10) కూడా మర్‌క్రమ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. పుజారా (9 నాటౌట్‌), కోహ్లీ (14 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. రబాడా, జాన్సెన్‌కు తలో వికెట్‌ దక్కింది. భారత్‌ 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.

స్కోర్‌బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్‌ : 223/10 (77.3 ఓవర్లు)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : ఎల్గర్‌ (బి) బుమ్రా (సి) పుజారా 3; మర్‌క్రమ్‌ (బి) బుమ్రా 8; కేశవ్‌ మహరాజ్‌ (బి) 25; కీగన్‌ పీటర్సన్‌ (బి) బుమ్రా (సి) పుజారా 72; డస్సెన్‌ (బి) ఉమేష్‌ (సి) కోహ్లీ 21; బవుమా (బి) షమీ (సి) కోహ్లీ 28; కైల్‌ (బి) షమీ (సి) పంత్‌ 0; జాన్సెన్‌ (బి) 7; రబాడా (బి) ఠాకూర్‌ (సి) బుమ్రా 15; ఒలివర్‌ (నాటౌట్‌) 10; నిగిడి (బి) బుమ్రా (సి) అశ్విన్‌. ఎక్స్‌ట్రాలు 18. మొత్తం 76.3 ఓవర్స్‌లో 210 వద్ద ఆలౌట్‌. వికెట్ల పతనం : 1-10, 2-17, 3-45, 4-112, 5-159, 6-159, 7-176, 8-179, 9-200, 10-210. బౌలింగ్‌ : బుమ్రా 23.3-8-42-5, ఉమేష్‌ 16-3-64-2, షమీ 16-4-39-2, ఠాకూర్‌ 12-2-37-1, అశ్విన్‌ 9-2-15-0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : కేఎల్‌ రాహుల్‌ (బి) జాన్సెన్‌ (సి) మర్‌క్రమ్‌ 10; మయాంక్‌ అగర్వాల్‌ (బి) రబాడా (సి) ఎల్గర్‌ 7; పుజారా (నాటౌట్‌) 9; కోహ్లీ (నాటౌట్‌) 14. మొత్తం : 17 ఓవర్స్‌లో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు. ఎక్స్‌ట్రాలు : 17. వికెట్ల పతనం : 1-20, 2-24. బౌలింగ్‌ : రబాడా 6-1-25-1, ఒలివర్‌ 2-0-13-0, జాన్సెన్‌ 5-3-7-1, నిగిడి 3-3-0-0, కేశవ్‌ 1-1-0-0.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement