Saturday, November 23, 2024

బోర్డు రూల్స్‌ మార్చాలి.. సుప్రీంలో బీసీసీఐ అభ్యర్థన..

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీసీసీఐ రాజ్యాంగంలో నియమనిబంధనలను మార్పులకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన వ్యాఖ్యాన్ని సత్వరమే విచారణ జరపాలని బీసీసీఐ అభ్యర్థించింది. ఈ మేరకు శుక్రవారంనాడు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని జస్టిస్‌ క్రిష్ణమురారి ధర్మాసనం ముందు బీసీసీఐ తరఫు సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ పట్వాలియా ప్రస్తావించారు. గత రెండేళ్లుగా ధర్మాసనం ముందు ఈ విషయం పెండింగ్‌లో ఉందని, తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు.

బోర్డు రూల్స్‌ తక్షణమే సవరణలు చేయాల్సిన అవసరముందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ… వచ్చే వారం పరిశీలిస్తామని పేర్కొన్నారు. జస్టిస్‌ ఆర్‌.ఎం. లోథా కమిటీ సిఫారసులు అమలు చేయడంలో భాగంగా బీసీసీఐ బోర్డు రాజ్యాంగంలో తక్షణమే సవరణలు తీసుకురావాల్సి ఉంది. అందులో భాగంగానే బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement