Monday, November 18, 2024

Bills Due – హత విధి – ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత

ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. అయితే కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్లనే పవర్ కట్ చేశారు. ఉప్పల్‌ స్టేడియం నిర్వాహకులు విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్‌ వాడుకున్నారని విద్యుత్‌ శాఖ తెలిపింది.

కాగా.. కొన్ని నెలలుగా బిల్లులు కట్టకపోవడంతో పవర్ కట్ చేశామని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. అందుకోసమని.. స్టేడియంలో ఆ జట్లు ప్రాక్టీస్‌ చేస్తుండగా విద్యుత్ నిలిపివేశారు. దీంతో.. ఇప్పుడు అభిమానులు ఆందోళనలో పడ్డారు. కీలక మ్యాచ్‌కు ముందు ఇలా పవర్ కట్ చేయడంతో.. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. విద్యుత్ అధికారులు పవర్ కట్ అంశంపై స్పందింస్తూ, పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చామని.. హెచ్‌సీఏ పట్టించుకోలేదని అన్నారు. అందుకోసమనే ఇప్పుడు విద్యుత్‌ సరఫరాను కట్‌ చేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ.. 15 రోజుల క్రితం నోటీసులు పంపించినట్లు హబ్సిగూడ ఎస్ఈ తెలిపారు. అయితే.. సన్ రైజర్స్, సీఎస్కే ప్రాక్టీస్ కు అంతరాయం కలగకుండా.. తాత్కలికంగా జనరేటర్‌తో పవర్‌ను సరఫరా చేశారు హెచ్సీఏ నిర్వాహకులు

Advertisement

తాజా వార్తలు

Advertisement