వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించినప్పటికీ.. పవర్‌ప్లే ముగిసేసరికి ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (21) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను చేపట్టాడు. అతనికి రిషభ్ పంత్ (44) కూడా మంచి సహకారం అందించాడు. 12వ ఓవర్లో గేరు మార్చేందుకు ప్రయత్నించిన హుడా.. కవర్స్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అల్జారీ జోసెఫ్ వేసిన బంతి ఎక్స్ ట్రా బౌన్స్ అవడంతో నేరుగా కవర్స్ లో ఉన్న బ్రాండన్ కింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇక.. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ 30, దినేశ్ కార్తీక్‌తో కలిసి వేగం పెంచే క్రమంలో డీకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సంజూకీ జోడీగా అక్సర్ వచ్చి దబిడ దిబిడి అనిపించాడు. 8 బంతుల్లో 20 పరుగులు బాది స్కోరు బోర్డును కదిలించాడు.